: వివాదాల నడుమ ఐపిఎల్-6
ఐపీఎల్ ఆరవ సీజన్ పలు వివాదాలకు వేదికగా మారింది. తొలుత శ్రీలంక క్రికెటర్లతో కూడిన జట్లు చెన్నైలో ఆడడానికి వీల్లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిషేధం విధించారు. శ్రీలంకలో తమిళుల ఊచకోతను నిరసిస్తూ ఆమె ఈ చర్య తీసుకున్నారు.
ఇక ప్రముఖ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారూక్ ఖాన్ ను ముంబై వాంకడే స్టేడియంలోకి అడుగుపెట్టకుండా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసిఎ) చర్యలు తీసుకుంది. గతేడాది ఐపీఎల్ లో భాగంగా ముంబైలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు అనంతరం షారూక్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారంటూ ఎంసిఎ ఆయనపై 5 సంవత్సరాలు నిషేధం విధించింది. దీంతో షారూక్ వాంకడే స్టేడియంలో మ్యాచుకు దూరంగానే ఉండిపోయారు. ఇప్పుడు తాజాగా బయటపడిన స్పాట్ ఫిక్సింగ్ ఐపిఎల్ వివాదాలను పతాక స్థాయికి చేర్చింది.