jagan: మాకు ప్రత్యేక హోదానే కావాలి... ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన జగన్

  • హోదా వస్తే అత్యధికంగా గ్రాంట్లు వస్తాయి
  • విభజన సమయంలో తీరని అన్యాయం జరిగింది
  • హైదరాబాదును కోల్పోయాం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు వస్తాయని అన్నారు. ప్రస్తుతం రూ. 3 వేల కోట్ల గ్రాంట్లు మాత్రమే లభిస్తున్నాయని తెలిపారు. విభజన సమయంలో పార్లమెంటులో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదని చెప్పారు.

హోదా ఇవ్వకపోవడానికి చాలా సాకులు ఉన్నాయని అన్నారు. 2014లో హోదాపై కేంద్ర కేబినెట్ తీర్మానం కూడా చేసిందని తెలిపారు. విభజన సమయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే హైదరాబాదును కోల్పోయామని చెప్పారు. విభజన ఫలితంగా ఉమ్మడి రాష్ట్ర అప్పులను వారసత్వంగా పొందామని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ తమకు అవసరం లేదని... హోదానే కావాలని అన్నారు.

jagan
special status
resolution
assembly
  • Loading...

More Telugu News