YSRCP: ఇతర పార్టీల నేతలకు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆఫర్

  • ఎవరైనా నేరుగా నా వద్దకే రావచ్చు
  • పార్టీలో చేరికల్లో మధ్యవర్తుల ప్రమేయం లేదు
  • తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న వారికి ఈనెల 20 నుంచి అవకాశాలుంటాయని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, తన నియోజకవర్గంలో ఎవరైనా పార్టీలో చేరాలనుకుంటే, నేరుగా తన వద్దకే రావచ్చని, మధ్యవర్తులు, వారి ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేశారు.

 తాడిపత్రిలో మట్కా అన్న మాట వినిపించకుండా చూడాలని కేతిరెడ్డి పోలీసులను ఆదేశించారు. మట్కాను అరికట్టేందుకు వైసీపీ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేస్తుందని, వారే మట్కాగాళ్లను పోలీసులకు అప్పగిస్తారని అన్నారు. తాము బెదిరింపులకు దిగుతున్నామని మాజీ ఎంపీ జేసీ కుమారుడు పవన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.

గతంలో ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని, 'స్పర్శ' పేరుతో విరాళాలు సేకరించింది ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు. పట్టణంలోని 15 వార్డుల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని, ఇక్కడి నుంచి రూ. 2కే క్యాన్‌ నీటిని అందిస్తామని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

YSRCP
Ketireddy
Party Change
  • Loading...

More Telugu News