Jeevan Reddy: చిన్నవాడైన జగన్‌ని చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలి: కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి

  • సంఖ్య ముఖ్యం కాదు.. ప్రశ్నించడమే ముఖ్యం
  • ప్రశ్నించే వారిని లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యం
  • అది చూసైనా కేసీఆర్‌కు కనువిప్పు కావాలి

చిన్నవాడైన ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తమ సంఖ్య ఎంతన్నది ముఖ్యం కాదని, ప్రశ్నించడమే ముఖ్యమన్నారు. ప్రతిపక్షాలను బలహీన పరచడం ద్వారా ప్రశ్నించే వారిని లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు.

తన పార్టీలోకి ఎవరైనా రావాలనుకుంటే వారి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ చెప్పడం హర్షించదగిన పరిణామమన్నారు. ఇది చూసైనా కేసీఆర్‌కు కనువిప్పు కావాలని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో సీపీఎస్ విధానం రద్దుకు కృషి చేస్తున్నారంటూ జీవన్‌రెడ్డి కొనియాడారు.

Jeevan Reddy
Jagan
KCR
CPS
Party Membership
Congress
Opposition
  • Loading...

More Telugu News