New Delhi: దేశ రాజధానిలో.. పోలీసులను తరిమి కొట్టిన నిరసనకారులు

  • ఆటో డ్రైవర్, అతని కుమారుడిని కొట్టిన పోలీసులు
  • నిరసనగా రోడ్డుపై బైఠాయించిన కొందరు వ్యక్తులు
  • నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులు

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో నేడు ఓ ఆటో డ్రైవర్ సరబ్‌జిత్ సింగ్, అతడి కుమారుడిని పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళుతూ కొట్టారు. దీనికి నిరసగా కొందరు వ్యక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో షాలిమర్ బాగ్ పోలీసులు నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసన కారులు ఏసీపీ సహా పోలీసులను వెంబండించి మరీ కొట్టారు. అంతే కాకుండా తీవ్ర పదజాలంతో దూషణకు పాల్పడ్డారు. నిరసనకారుల దాడిలో షాలిమర్ బాగ్ ఏసీపీ కేజీ త్యాగి సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

New Delhi
Police
ACP
Sarabjith Singh
Shalimar bagh
KG Tyagi
  • Loading...

More Telugu News