Andhra Pradesh: డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి నామినేషన్

  • డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
  • కోన నామినేషన్ ను బలపరిచిన 10 మంది ఎమ్మెల్యేలు 
  • రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి  నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. కోన రఘుపతి నామినేషన్ ను బలపరుస్తూ పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు దాఖలు చేయవచ్చు. రేపు ఉదయం పదకొండు గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

కాగా, 2014లో తొలిసారిగా వైసీపీ తరపున బాపట్ల ఎమ్మెల్యేగా కోన రఘుపతి గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు గతంలో ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ గా పనిచేశారు.

Andhra Pradesh
Deputy
speaker
kona Raghupati
  • Loading...

More Telugu News