Andhra Pradesh: అసెంబ్లీ లాబీలో ఎదురుపడ్డ బాలయ్య, రోజా.. పలకరింపులు!

  • ‘బాగున్నారా’ అంటూ పరస్పరం పలకరింపులు
  • రోజాతో  సెల్ఫీలు దిగేందుకు వైసీపీ కార్యకర్తల ఆసక్తి
  • కార్యకర్తల సందడితో సభలోకి వెళ్లేందుకు ఇబ్బందిపడ్డ అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజాలు ఎదురుపడ్డారు. ‘బాగున్నారా’ అంటూ పరస్పరం పలకరించుకున్నారు. అంతకుముందు అసెంబ్లీ లాబీలో రోజాతో కలిసి సెల్ఫీలు దిగేందుకు వైసీపీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. ఇదిలా ఉండగా, కార్యకర్తల సందడి ఎక్కువగా ఉండటంతో సభలోకి వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొంచెం ఇబ్బందిపడ్డారు. మార్షల్స్ సాయంతో సభలోకి ఆయన వెళ్లారు. ఏపీ సమావేశాల్లో భాగం నాల్గో రోజు వాడీవేడిగా చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా జరిగిన చర్చ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. 

Andhra Pradesh
Telugudesam
mla
nandamuri
YSRCP
  • Loading...

More Telugu News