Maniratnam: మణిరత్నంకు నాలుగోసారి గుండెపోటు... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

  • గతంలో మూడుసార్లు హార్ట్ ఎటాక్
  • ఆందోళనలో ఉన్న సన్నిహితులు 
  • పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనకి నాలుగోసారి గుండెపోటు రావడంతో సన్నిహితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పలువురు సినీ ప్రముఖులు కోరారు.

కాగా, 2004లో 'యువ' సినిమా షూటింగ్‌ వేళ, మణిరత్నంకు తొలిసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. సెట్‌ లో ఉన్న వేళ, తన ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. ఆపై 2015 సంవత్సరంలో 'ఓకే బంగారం' షూటింగ్ వేళ కశ్మీర్లో, 2018లో మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే హిస్టారికల్ మూవీ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Maniratnam
Heart Attack
Hospital
  • Loading...

More Telugu News