Rahul Gandhi: రాహుల్.. పెళ్లి చేసుకో.. మరింత రాటుదేలుతావు!: కేంద్ర మంత్రి అథవాలే సలహా

  • రాహుల్ గాంధీ నాకు స్నేహితుడు
  • అందుకే సలహా ఇస్తున్నాను
  • కాంగ్రెస్ విజయం కోసం రాహుల్ బాగా కష్టపడ్డాడు

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 లోక్ సభ స్థానాలకే పరిమితం అయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే స్పందించారు. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి మానసికంగా దృఢంగా తయారు కావాలంటే వెంటనే పెళ్లి చేసుకోవాలని రాహుల్ కు అథవాలే సూచించారు.

పెళ్లి చేసుకుంటే రాహుల్ మరింత రాటుదేలుతారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తనకు స్నేహితుడనీ, అందుకే సలహా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం రాహుల్ గట్టిగా కష్టపడ్డారని ప్రశంసించారు. గతంలో పలువురు పెళ్లి ఎప్పుడని రాహుల్ ను ప్రశ్నించగా, తాను పార్టీని పెళ్లిచేసుకున్నానని రాహుల్ జవాబు ఇచ్చారు.

Rahul Gandhi
Congress
marriage
minister
athavale ramdas
advice
  • Loading...

More Telugu News