Andhra Pradesh: టీడీపీ కార్యకర్తలపై చేయి పడితే ఊరుకోం.. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వార్నింగ్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-93b310f5ba565a43e1cbc9abe5cfb0c60357c06e.jpg)
- టీడీపీకి బలమైన కేడర్ ఉంది
- ఎన్నికల్లో గెలుపోటములు సహజం
- పార్టీ అండగా ఉంటుంది.. కార్యకర్తలు అధైర్యపడొద్దు
తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. టీడీపీ పటిష్టతకు కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం నుంచి ఓడిపోయిన వ్యక్తులు ఇక్కడకు వచ్చి పెత్తనం చేస్తానంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పెద్దాపురంలోని సుధాకాలనీలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చినరాజప్ప చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై చేయి పడితే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ కేడర్ కు చినరాజప్ప దిశానిర్దేశం చేశారు.