Resto Bar: హైదరాబాద్ పబ్ డ్యాన్సర్ పై దాడి కేసులో స్పందించిన పోలీసులు!

  • లిస్బన్ రెస్టో బార్ లో ఘటన
  • తోటి డ్యాన్సర్ పై యువతుల దాడి
  • పట్టించుకోలేదని హరిణి ఫిర్యాదు
  • శాఖాపరమైన చర్యలుంటాయన్న అధికారులు

హైదరాబాద్ లోని లిస్బన్ రెస్టో బార్ లో డ్యాన్సర్ గా ఉన్న తనను తోటి డ్యాన్సర్లు దారుణంగా కొడితే, పోలీసులు పట్టించుకోలేదని హరిణి చేసిన ఆరోపణలపై అధికారులు స్పందించారు. ఈ కేసులో హరిణి చేసిన ఆరోపణలు నిజమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు.

ఇప్పటికే ఈ కేసులో పబ్ లో డ్యాన్సర్లుగా ఉన్న ఎర్రబెల్లి సంధ్య అలియాస్‌ రితిక (24), జెక్క శ్రావణి అలియాస్‌ స్వీటీ (20), ఎస్‌.రేఖ అలియాస్‌ మధు (25), కొడాలి విజయారెడ్డి అలియాస్‌ విజ్జు (24)లను అరెస్ట్ చేశామని తెలిపారు. మధ్యవర్తి సయ్యద్‌ మాజీద్‌ హుస్సేన్‌ అలియాస్‌ సయీద్‌ (30) కోసం గాలిస్తున్నామని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఓ కస్టమర్ వద్దకు వెళ్లాలని తోటి డ్యాన్సర్లు హరిణిపై ఒత్తిడి తెచ్చారన్న ఫిర్యాదు తమకు అందిందని దీన్ని విచారిస్తున్నామని తెలిపారు.

Resto Bar
Pub Dancer
Harini
Police
Lisbon
  • Loading...

More Telugu News