Cricket: టాస్ గెలిచినా ఉపయోగించుకోలేకపోయిన శ్రీలంక!
- ఆసీస్ ఓపెనర్ల పటిష్ట భాగస్వామ్యం
- రాణించిన ఫించ్
- ఆసీస్ కు శుభారంభం
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లండన్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. మబ్బులు పట్టివుండడంతో గాల్లోని తేమను తమ బౌలర్లు ఉపయోగించుకుంటారని శ్రీలంక కెప్టెన్ భావించి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
కానీ, ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, ఫించ్ లంక బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ తొలి వికెట్ కు 80 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. మలింగ, ప్రదీప్, పెరెరా వంటి పేసర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 26 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడుతూ లంక బౌలర్లకు పరీక్ష పెట్టాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు. కెప్టెన్ ఫించ్ కు తోడు ఉస్మాన్ ఖవాజా క్రీజులో ఉన్నాడు.