Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో కోత.. వివరణ ఇచ్చిన ఏపీ పోలీసులు!

  • పైలెట్ వాహనాన్ని తప్పించిన ప్రభుత్వం
  • ప్రోటోకాల్ ప్రకారమే తొలగించామన్న పోలీసులు
  • మాజీ సీఎం భద్రత యథాతథంగా ఉందని వ్యాఖ్య

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ ప్రయాణికుల తరహాలో తనిఖీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు చంద్రబాబు కాన్వాయ్ కు ఇటీవల పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను తొలగించడంపై కూడా పలువురు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న చంద్రబాబుకు భద్రతను కుదించడం సరికాదని వ్యాఖ్యానించారు.

తాజాగా ఈ వివాదంపై ఏపీ పోలీసులు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేటాయించిన భద్రతలో ఎలాంటి మార్పులు లేవని ఏపీ పోలీసులు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు కాన్వాయ్ లోని అడ్వాన్స్ పైలెట్ కారును మాత్రమే తొలగించామని వెల్లడించారు. రోడ్డు క్లియరెన్స్ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో అనవసరమైన అపోహలు వద్దని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Police
security
explanation
  • Loading...

More Telugu News