Andhra Pradesh: తెలుగుదేశం నేత రాయపాటికి గన్ మెన్లను తొలగించిన ప్రభుత్వం!

  • ఇప్పటికే చంద్రబాబు భద్రత కుదింపు
  • తాజాగా రాయపాటి గన్ మెన్లు తొలగింపు
  • మండిపడుతున్న తెలుగుదేశం నేతలు, అభిమానులు

తెలుగుదేశం నేత, లోక్ సభ మాజీ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఇన్నాళ్లూ కల్పించిన గన్ మెన్లను తొలగించారు. ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను సైతం ఏపీ ప్రభుత్వం కుదించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా, తాజాగా ఆయన వాహనానికి పైలెట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారును తొలగించారు.

తాజాగా రాయపాటికి కూడా గన్ మెన్లను తప్పించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తమ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాగా, తన గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించడంపై రాయపాటి సాంబశివరావు ఇంతవరకూ స్పందించలేదు.

Andhra Pradesh
Telugudesam
rayapati
sambasivarao
ap government
Chandrababu
gun mens removed
  • Loading...

More Telugu News