ICC World Cup: ఇంగ్లండ్‌ను గెలిపించిన రూట్ ఖాతాలో అద్భుత రికార్డు

  • ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు
  • వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఇంగ్లిష్ క్రికెటర్
  • విండీస్‌తో మ్యాచ్‌లో అజేయ సెంచరీ

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 33.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జో రూట్ సెంచరీ నమోదు చేశాడు. 28 ఏళ్ల రూట్ 94 బంతుల్లో 11 ఫోర్లతో అజేయ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో రూట్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో మూడు సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 2015 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన రూట్.. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు బాదాడు.

ICC World Cup
England
Joe root
  • Loading...

More Telugu News