Telugudesam: నేను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం: టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి

  • టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడను
  • రామసుబ్బారెడ్డి, నేను కలిసిపోయినా పార్టీ ఓడింది
  • దీని వెనుక బలమైన కారణాలు ఏవో ఉన్నాయి

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి ఆ పార్టీని వీడనున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ విషయమై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడనని స్పష్టం చేశారు.

తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి రామసుబ్బారెడ్డి, తాను కలిసినప్పటికీ తమ పార్టీ ఓడిపోవడం వెనుక బలమైన కారణాలు ఏవో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తమ కలయిక వల్ల ఇబ్బంది తలెత్తుతుందని కొందరు భావించారని అనుమానపడ్డారు. ఈ సందర్భంగా ఈవీఎంల తీరుపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తన నియోజకవర్గంలో కొన్ని ఆధారాలు లభించాయని వ్యాఖ్యానించారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించిన ఆదినారాయణరెడ్డి, టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, తమ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.

Telugudesam
adi narayana reddy
rama subba reddy
YSRCP
  • Loading...

More Telugu News