Telangana: నాకు అతనే కావాలి.. ప్రియుడి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి!

  • తెలంగాణలోని పెద్దపల్లిలో జిల్లాలో ఘటన
  • రహస్యంగా అనూషాను పెళ్లాడిన శ్రీకాంత్
  • కుటుంబ సభ్యుల ముందు వివాహానికి నో

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఈరోజు ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేసింది. ప్రియుడు తనను మోసం చేశాడనీ, తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరగకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. పెద్దపల్లి జిల్లా అప్పనపేటకు చెందిన అనూష అనే యువతి శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు యువతి చెబుతోంది.

అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో తనను వివాహం చేసుకోవాలని కోరడంతో యువకుడు నిరాకరించాడు. దీంతో తనకు పోలీసులు, గ్రామపెద్దలు న్యాయం చేయాలని అనూష వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, గ్రామపెద్దలు, కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దిగాలని కోరారు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. చివరికి శ్రీకాంత్ తో పెళ్లి జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అనూష ట్యాంక్ నుంచి కింద దిగింది. వారం రోజుల్లోగా తనకు శ్రీకాంత్ తో వివాహం చేయకుంటే ఇదే ట్యాంక్ ఎక్కి, దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

Telangana
Peddapalli District
love affair
girl climbed water tank
Police
suicide warning
  • Loading...

More Telugu News