Andhra Pradesh: గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై పెదవి విరిచిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ!

  • గవర్నర్ నవరత్నాలనే ప్రస్తావించారు
  • చేతివృత్తులను పట్టించుకోలేదు
  • అమరావతిలో మీడియాతో హిందూపురం ఎమ్మెల్యే

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు గవర్నర్ ప్రసంగంపై పెదవి విరిచారు. తన ప్రసంగంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని, ఏపీలోని చేతివృత్తులను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం జలయజ్ఞం గురించే గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల అయిన రాజధాని అమరావతిపై నోరు మెదపలేదని విమర్శించారు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై ప్రజలంతా ఆలోచిస్తారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
governor
Balakrishna
speach
  • Loading...

More Telugu News