Anju Suthar: పెద్దలు విడదీయడంతో ఎడబాటు భరించలేక ఆత్మహత్య చేసుకున్న జంట

  • ప్రేమించుకున్న అంజు సుతార్, శంకర్ చౌదరి
  • అంజుకు వేరొక వ్యక్తితో వివాహం
  • తుపాకులతో కణతల్లో కాల్చుకుని ఆత్మహత్య

ప్రేమించుకుని కొన్నాళ్లపాటు సహజీవనం కూడా చేశారు. అయితే ప్రియురాలికి పెద్దలు వేరే పెళ్లి చేయడంతో ఇద్దరూ ఎడబాటును భరించలేక పోయారు. దీంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా నాటు తుపాకులతో కణతల్లో కాల్చుకుని చనిపోయారు.

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన శంకర్ చౌదరి, అంజు సుతార్ ప్రేమించుకుని కొంతకాలం పాటు సహజీవనం చేశారు. అయితే ఇటీవల అంజు కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేశారు. దీంతో ఇక తాము కలిసుండలేమని భావించి ఆత్మహత్య చేసుకోవాలని అంజు, శంకర్ నిర్ణయించుకున్నారు.

తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు మొబైల్‌లో రికార్డ్ చేశారు. అనంతరం మద్యం తాగి, తుపాకులతో కణతలకు కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఘటనా స్థలంలో నాటు తుపాకులు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Anju Suthar
Shankar Chowdary
Suicide
Police
Rajasthan
Guns
  • Loading...

More Telugu News