T-congress: రామ్ మాధవ్ ను నేను కలిశానన్న వార్తలు అబద్ధం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • ఈ వార్తలను ఖండిస్తున్నా
  • అసలు, రామ్ మాధవ్ ఎవరో నాకు తెలియదు
  • నాకు పార్టీ మారే ఆలోచన లేదు

నిన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ తో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి భేటీ అయినట్లు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ వార్తలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. రామ్ మాధవ్ ను తాము కలవలేదని స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పిన కోమటిరెడ్డి, అసలు, రామ్ మాధవ్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించడం గమనార్హం. భువనగిరి ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.

T-congress
komati reddy
bjp
Ram madhav
  • Loading...

More Telugu News