Andhra Pradesh: వైసీపీ సభాసంప్రదాయాలను పాటించలేదు.. చంద్రబాబును ఆహ్వానించలేదు!: అచ్చెన్నాయుడు
- సభలో ఫలప్రదమైన చర్చలను ఆశిస్తున్నాం
- స్పీకర్ అధికార, విపక్షాన్ని సమదృష్టితో చూడాలి
- అసెంబ్లీలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫలప్రదమైన చర్చలకు అవకాశం ఉండాలని కోరుకుంటున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తెలిపారు. అధికార, విపక్షాలను స్పీకర్ సమదృష్టితో చూస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు కొత్త స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారాంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ నేతలు స్పీకర్ ను చైర్ లో కూర్చోబెట్టే విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించలేదని వ్యాఖ్యానించారు. గత సంప్రదాయాలను అధికార పార్టీ పాటించలేదన్నారు. వైసీపీ వారు చంద్రబాబును ఆహ్వానించి ఉంటే బాగుండేదని చెప్పారు.