India: నాటింగ్ హామ్ ను వదలని వరుణుడు... నేడు న్యూజిలాండ్ తో మ్యాచ్ డౌటే!

  • నేడు న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్
  • ఉదయం నుంచి కురుస్తూనే ఉన్న వర్షం
  • కాస్తంత ఆలస్యంగానైనా మ్యాచ్ జరగాలని కోరుకుంటుున్న అభిమానులు

వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా, నేడు నాటింగ్ హామ్ లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగే సూచనలు కనిపించడం లేదు. ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారి, నీటితో నిండింది. దీంతో ప్రాక్టీస్ సెషన్ కూడా జరగలేదు. మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం అది న్యూజిలాండ్ కే లాభిస్తుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

నాటింగ్ హామ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, వర్షం తగ్గే అవకాశం కూడా ఉంది. దీంతో నేటి మ్యాచ్ కాస్తంత ఆలస్యంగానైనా ప్రారంభమవుతుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. కాగా, ఇప్పటికే మూడు మ్యాచ్ లాడిన న్యూజిలాండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ఇండియా రెండు మ్యాచ్ లాడి, రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది.

India
Newzeland
Cricket
World Cup
  • Loading...

More Telugu News