R & B ministry: అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి ప్రాధాన్యం : ఆర్‌అండ్‌బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

  • ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మంత్రి
  • ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను 
  • అన్నివర్గాల సమన్వయంతో అభివృద్ధికి కృషి

అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్‌లో ఈరోజు బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రోడ్లు, భవనాల శాఖ అత్యంత కీలకమైనదని, అటువంటి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా అవసరమైన అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, మంత్రివర్గం కూర్పు ఇందుకు చక్కని ఉదాహరణ అని కొనియాడారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు.

R & B ministry
dharmana krishanadas
took charge
  • Loading...

More Telugu News