Narendra Modi: ఇంటి నుంచి పనిచేయడం మానండి.. 9:30కే ఆఫీసుకు రండి: మంత్రులకు ప్రధాని క్లాస్

  • నిర్ణీత సమాయానికి ఆఫీసుకు రండి
  • పార్లమెంటు సమావేశాలు జరిగే 40 రోజులు వేరే పనులు పెట్టుకోవద్దు
  • మంత్రులు-ఎంపీల మధ్య పెద్ద తేడా ఏం లేదు

కేంద్రమంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ క్లాస్ పీకారు. ఇంటి నుంచి పనిచేసే అలవాటును మానుకోవాలని, ఉదయం 9:30 గంటలకల్లా కార్యాలయాలకు చేరుకోవాలని ఆదేశించారు. అలాగే, పార్లమెంటు సమావేశాలు జరిగే 40 రోజులూ తప్పకుండా హాజరుకావాలని, ఆయా రోజుల్లో ఇతర పనులు పెట్టుకోవద్దని సూచించారు.

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుకు నిర్ణీత సమయానికే చేరుకునేవాడినని గుర్తు చేశారు. మంత్రులు కూడా సమయానికి కార్యాలయానికి వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక బుధవారం తొలిసారి మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. మంత్రులు, ఎంపీల మధ్య పెద్దగా తేడాలేదని, కాబట్టి ఎంపీలను కలిసేందుకు మంత్రులు కొంత సమయం కేటాయించాలని సూచించారు.

Narendra Modi
Union ministers
MPs
BJP
  • Loading...

More Telugu News