Assembly: మాకొచ్చిన నష్టమేమీ లేదు.. రావెల కిశోర్ బాబు రాజీనామాపై జనసేన!

  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలోకి
  • ఆపై ఓడిపోయి రాజీనామా చేసిన రావెల
  • ఆయనవి అవకాశవాద రాజకీయాలన్న పార్టీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి, ఆపై ఓటమిపాలైన మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు పార్టీకి రాజీనామా చేయడంపై జనసేన స్పందించింది. ఆయన పార్టీని వీడి వెళ్లడం వల్ల ఎటువంటి నష్టం లేదని వ్యాఖ్యానించింది. రావెల ఒంటరిగానే జనసేనలోకి వచ్చారని, ఒంటరిగానే రాజీనామా చేసి పోయారని పేర్కొంది. ఆదరించిన పార్టీని వీడిన రావెల, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారని ఆరోపించింది.

ప్రత్తిపాడులోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన నేతలు, రావెల మంత్రిగా పని చేసిన సమయంలోనే టీడీపీ శ్రేణులు ఆయన్ను అవమానాలకు గురి చేశాయని, ఆ సమయంలో ఆదరించి, అక్కున చేర్చుకుంటే, పవన్ నమ్మకాన్ని వమ్ము చేసిన రావెల, అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

Assembly
Ravela Kishore Babu
Jana Sena
  • Loading...

More Telugu News