Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శ్రీదేవి పాత్ర చేయాలనుందట!
  • అఖిల్ కు అమ్మగా ఆమని 
  • మరో సినిమాలో భూమిక

*  ప్రముఖ నటి శ్రీదేవి బయోపిక్ లో నటించాలని వుందని చెబుతోంది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. 'నాకు చిన్నప్పటి నుంచీ శ్రీదేవి అంటే చాలా ఇష్టం. నేను నటిగా మారడానికి తనే స్ఫూర్తి. అవకాశం వస్తే ఆమె బయోపిక్ లో నటించాలనుంది' అని చెప్పింది.
*  అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమని అఖిల్ కు తల్లిగా నటించనుంది. విశేషం ఏమిటంటే, అఖిల్ చిన్నప్పుడు నటించిన 'సిసింద్రీ' చిత్రంలో కూడా అతనికి తల్లిగా ఆమని నటించింది.
*  ఇటీవల 'యూ టర్న్' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ నటి భూమిక తాజాగా మరో తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించే 'కన్నై నంబతి' చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషించనుంది.

Thamanna
Sridevi
akhil
amani
bhumika
  • Loading...

More Telugu News