Aravind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో మాజీ ముఖ్యమంత్రి భేటీ

  • కేజ్రీ నివాసానికి వెళ్లిన షీలా దీక్షిత్
  • రాజధానిలోని సమస్యలపై చర్చ
  • కరెంటు, నీటి సమస్యలపై చర్చ

ఢిల్లీ ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాసేపు ఆయనతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని సమస్యల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

గత శనివారం కేజ్రీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన షీలా దీక్షిత్ కరెంట్ సమస్యలు తీర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందంటూ విరుచుకు పడ్డారు. అయితే నేటి భేటీలో షీలా ముఖ్యంగా కరెంటు, నీటి సమస్యలపైనే చర్చించారు. వచ్చే ఆరు నెలల కాలానికి ప్రజల కరెంటు బిల్లులను మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోపక్క, ఎనిమిది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Aravind Kejriwal
Sheela Deekshith
Delhi
Power Problems
Water Problems
  • Loading...

More Telugu News