Kutumba Rao: కొందరు శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు: కుటుంబరావు విమర్శలు

  • కొందరు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు
  • న్యాయం చేసేందుకు ఎంతగానో ప్రయత్నించింది
  • బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్న కుటుంబరావు  

కొందరు శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులకు తమ ప్రభుత్వం న్యాయం చేయడానికి ఎంతగానో ప్రయత్నించిందన్నారు. కొందరు నేతలు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారిపై లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి వేసిన కమిటీ పారదర్శకంగా పనిచేసిందని, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం గనుక తప్పు చేసి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని, తమపై ఒక్క ఆరోపణ నిరూపితమైనా ప్రజా జీవితంలో ఉండమని కుటుంబరావు స్పష్టంచేశారు.

Kutumba Rao
Agri Gold
Legal Action
CBI
  • Loading...

More Telugu News