Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేలతో బాలయ్య ముచ్చట్లు.. వైరల్ గా మారిన ఫొటోలు!

  • నేడు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ప్రమాణస్వీకారం చేసిన జగన్, చంద్రబాబు, బాలయ్య
  • అసెంబ్లీ లాబీల్లో ఇరుపార్టీల నేతల ముచ్చట్లు

15వ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలతో సరదాగా ముచ్చటించారు. పలువురితో కరచాలనం చేశారు. అదే సమయంలో మరో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కొడాలి నానితో మాట్లాడారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని మీరూ చూసేయండి.

Andhra Pradesh
assembly
Balakrishna
Kodali Nani
ummareddy
Jagan
Chandrababu
  • Loading...

More Telugu News