Chandrababu: నవ్యాంధ్ర ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీలో కాలుమోపిన చంద్రబాబు!

  • తొలుత వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల
  • ఆపై వెలగపూడికి వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు
  • మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు

నిన్నమొన్నటి వరకూ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు, నేడు ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ ఉదయం తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన వెలగపూడికి చేరుకుని అసెంబ్లీ లోపలికి వెళ్లారు. ఆపై ఆయన నేరుగా విపక్ష నేతకు కేటాయించిన చాంబర్ లోకి వెళ్లారు.

మరికాసేపట్లో నవ్యాంధ్రకు రెండవ, ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించగా, అధికార తెలుగుదేశం ఇప్పుడు కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇక నేడు లాంఛన ప్రాయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, విపక్ష, అధికార పక్ష నేతలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది.

  • Loading...

More Telugu News