Rahul Gandhi: అబ్బాయిలకూ నేనే కావాలట... వాపోతున్న నటుడు అర్జున్ మాథుర్!

  • రాహుల్ గాంధీ పాత్రలో అలరించిన అర్జున్
  • ఆపై వెబ్ సిరీస్ లో 'గే' పాత్ర
  • పెళ్లి చేసుకోవాలని కోరుతున్న ఎంతోమంది స్వలింగ సంపర్కులు

బాలీవుడ్ నటుడు అర్జున్ మాథుర్... అమ్మాయిలే కాదు... అబ్బాయిలు కూడా ఎంత బాగున్నాడని అనుకునే అందం అతని సొంతం. "ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌" చిత్రంలో, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాత్రలో అర్జున్ నటించాడు. ఈ పాత్రకు మంచి గుర్తింపే రాగా, ఆ తరువాత ఆయన "మేడ్‌ ఇన్‌ హెవెన్‌" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అందులో అర్జున్ ఓ స్వలింగ సంపర్కుడి పాత్రను పోషించాడు. అంతే, ఇంకేముందు ఆయన ఇన్ బాక్స్ నెటిజన్లు నుంచి వస్తున్న మెసేజ్ లతో నిండిపోతోంది.

తాను ఓ 'గే' అనుకుని, అబ్బాయిల నుంచి ఎంతో అసభ్యకర మెసేజ్ లు వస్తున్నాయని, ఎంతో మంది తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారని, తాను అటువంటి వాడిని కాదని చెప్పినా వినడం లేదని ఇప్పుడు అర్జున్ మాథుర్ వాపోతున్నాడు. ఇదే సమయంలో తనను ప్రశంసిస్తూ, ఈ సిరీస్ విడుదలైన తరువాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని అంటున్న స్వలింగ సంపర్కులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చాడు. తాను తెరపై నటించే పాత్రలను, తన నిజ జీవితాన్ని కలిపి చూడవద్దని కోరుతున్నానని అన్నాడు.

Rahul Gandhi
Arjun Madhur
Gay
  • Error fetching data: Network response was not ok

More Telugu News