Chandrababu: చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు: ఉమ్మారెడ్డి

  • ఘోర పరాభవం నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేదు
  • చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమీ లేవు
  • తొలి కేబినెట్ సమావేశం గొప్పగా జరిగింది

ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా కోలుకోలేకపోతున్నారని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అధికారపక్షంపై ఆరోపణలు చేయడం మానుకుని... ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమీ లేవని అన్నారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సమీక్షిస్తామని ఎన్నికల సమయంలోనే జగన్ చెప్పారని... తప్పులు జరగనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తొలి కేబినెట్ సమావేశం గొప్పగా జరిగిందని... మంత్రులు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.

Chandrababu
jagan
ummareddy
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News