Andhra Pradesh: పార్వతీపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఆదివాసీల ఆందోళన!

  • ఏపీలో 25 జిల్లాలు చేస్తామన్న జగన్
  • నేడు విజయనగరంలో ఉద్యమించిన ప్రజాసంఘాలు
  • ఇంకా తుదినిర్ణయం తీసుకోని ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామనీ, గ్రామానికో సెక్రటేరియట్ నిర్మిస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. అంటే ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని జగన్ చెప్పారు. అయితే ఈ విషయంలో ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో పార్వతీపురం డివిజన్ ను ఆదివాసీ జిల్లాగా చేయాలని ప్రజాసంఘాలు, ఆదివాసీలు ఈరోజు ఆందోళనకు దిగారు. విజయనగరంలోని రాయగఢ్ రోడ్డు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు. వెంటనే పార్వతీపురం డివిజన్ ను ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు.

Andhra Pradesh
Jagan
Vijayanagaram District
parvathipuram district
adivasi agitation
  • Loading...

More Telugu News