Smruti Irani: ఇంతలోనే ఎలా మారిపోయానో... తన ఊబకాయంపై స్మృతీ ఇరానీ వ్యాఖ్య!

  • అమేధీలో రాహుల్ ను ఓడించిన స్మృతీ ఇరానీ
  • తనపై తానే కామెంట్ చేసుకున్న కేంద్ర మంత్రి
  • గంటల వ్యవధిలో వేల లైక్స్

గాంధీల కుటుంబానికి అత్యంత విధేయులుగా ఉన్న అమేధీ వాసులను ఆకట్టుకుని, రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, సోషల్‌ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి తనపై తానే కామెంట్లు వేసుకుంటూ, నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా, ఆమె తన ఊబకాయంపైనా వ్యాఖ్యలు చేశారు.

గతంలో నటిగా ఉన్న సమయంలో తానెంత స్లిమ్ గా ఉండేదాన్నన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, అప్పటి ఫొటోను, ఇప్పటి ఫొటోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి "చూస్తుండగానే... ఎలా ఉన్నవాళ్లం ఎలా అయిపోయాం" అన్న చలోక్తిని జోడించారు. దీనికి సామాజిక మాధ్యమాల నుంచి చక్కటి స్పందన వచ్చింది. గంటల వ్యవధిలో వేల లైక్స్ వచ్చాయి.

Smruti Irani
Twitter
Old Photo
Latest
Amethi
  • Loading...

More Telugu News