samanta: 'ఓ బేబీ' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • కొరియన్ మూవీ రీమేక్ గా 'ఓ బేబీ'
  • ప్రధాన పాత్ర ధారులుగా సమంత - లక్ష్మి 
  • ముఖ్యమైన పాత్రలో నాగశౌర్య     

సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత జోడీగా నాగశౌర్య కనిపించనున్నాడు. కీలకమైన పాత్రను సీనియర్ హీరోయిన్ లక్ష్మి పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.

"నాలో మైమరపు నాకే .. కనుసైగ చేస్తే ఇలా, ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా?" అంటూ ఈ పాట సాగుతోంది. సమంత పాత్ర స్వరూప స్వభావాలకు అద్దంపడుతూ, ఆమె భావాలను ఆవిష్కరించే పాట ఇది. వినడానికి హాయిగా అనిపించే మెలోడియస్ గీతం ఇది. మిక్కీ జె.మేయర్ సంగీతం .. భాస్కరభట్ల సాహిత్యం .. మోహన భోగరాజు ఆలాపన మనసును తాకేలా వున్నాయి. సౌత్ కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా రానున్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

samanta
lakshmi
  • Error fetching data: Network response was not ok

More Telugu News