Chandrababu: గిరీశ్ కర్నాడ్ మృతి సినీరంగానికే కాకుండా సామాజిక రంగానికి కూడా తీరని లోటు: చంద్రబాబు

  • గిరీశ్ కర్నాడ్ సేవలను కొనియాడిన చంద్రబాబు
  • సామాజికవేత్తగా గిరీశ్ సేవలు స్ఫూర్తి దాయకం
  • గిరీశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్(81) నేటి ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడిగా, దర్శకుడిగా గిరీశ్ కర్నాడ్ చేసిన సేవలను చంద్రబాబు కొనియాడారు. గిరీశ్ కర్నాడ్ మృతి సినీ రంగానికే కాకుండా సామాజిక సేవారంగానికి కూడా తీరని లోటన్నారు. సామాజికవేత్తగా ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Chandrababu
Condolence
Girish Karnad
Actor
Director
  • Loading...

More Telugu News