Karnataka: ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్ మృతిపై కేసీఆర్, జగన్ సంతాపం

  • దేశ నాటక, సాహిత్య రంగంలో గిరీశ్ కృషి ఎనలేనిది
  • సినీ, సాహిత్య రంగాలకు ఆయన మృతి తీరని లోటు
  • వేర్వేరు ప్రకటనల్లో సీఎం లు కేసీఆర్, జగన్

ప్రముఖ కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు గిరీశ్ కర్నాడ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గిరీష్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. గిరీశ్ కర్నాడ్ చేసిన సేవలకు గాను ఆయనకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు లభించాయని అన్నారు. కాగా, గిరీశ్ కర్నాడ్ మృతిపై ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం తెలిపారు. సినీ, సాహిత్య రంగాలకు ఆయన మృతి తీరని లోటుగా అభివర్ణించారు.

Karnataka
Artist
director
Girish karnadu
cm
kcr
jagan
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News