teja: సినిమాల్లోకి రాకముందు లారీ క్లీనర్ గా పనిచేశాను .. పేపర్లు కప్పుకుని పడుకున్నాను: దర్శకుడు తేజ

  • అమ్మ చనిపోయింది
  •  నాన్నకి వ్యాపారంలో నష్టమొచ్చింది
  •  బాబాయ్ దగ్గర ఉండలేకపోయాను

తెలుగు దర్శకులలో తేజ స్థానం ప్రత్యేకం. విభిన్నమైన .. విలక్షణమైన కథాంశాలను ఎంచుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటి తేజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిన్నప్పుడు తను పడిన కష్టాలను గురించి ప్రస్తావించాడు. "మా అమ్మానాన్నలు ఉన్నంతవరకూ నేను .. మా అక్కయ్య .. చెల్లి రాజభోగాలను అనుభవించాము.

హఠాత్తుగా అమ్మ చనిపోయింది .. వ్యాపారంలో నష్టాలతో ఆస్తులన్నీపోయాయి. తర్వాత నాన్న పోయారు. మా ముగ్గురిని బంధువులు పంచుకున్నారు. నేను మా బాబాయ్ దగ్గర ఉండలేక బయటికి వచ్చేశాను. లారీ క్లీనర్ గా పనిచేశాను .. హోటల్లో పనిచేశాను. చలికి పేపర్లు కప్పుకుని అరుగులపై పడుకున్నాను. కుళాయి దగ్గరే స్నానం చేసి .. అక్కడే బట్టలు ఉతికి ఆరేసుకునేవాడిని. చెన్నై వెళ్లినప్పుడు ఆ ప్రదేశాలన్నీ చూసినప్పుడు కళ్ల వెంట నీళ్లొస్తుంటాయి" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News