Sachin Tendulkar: ఆసీస్ లో ఆత్మవిశ్వాసం లోపించింది: సచిన్

  • ఆసీస్ ఆటతీరు మరింత విస్మయం కలిగించింది 
  • వార్నర్ ఇలా ఆడడం ఎప్పుడూ చూడలేదు 
  • రోహిత్, హార్దిక్ ల క్యాచ్ లు వదిలి మూల్యం చెల్లించుకున్నారు

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా చేతిలో పరాజయం పాలవడం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాలు వెల్లడించారు. మొదట డేవిడ్ వార్నర్ నిదానంగా ఆడడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆ తర్వాత కేవలం సింగిల్స్, డబుల్స్ తీస్తూ భారీ స్కోరును ఛేదించాలన్న ఆసీస్ ఆటతీరు మరింత విస్మయం కలిగించిందని అన్నారు. కళ్లముందు భారీ లక్ష్యం ఉన్నప్పుడు ఒకట్రెండు పరుగులు తీస్తూ ఎలా ఛేదిస్తారని సచిన్ ప్రశ్నించారు.

గతంలో ఎన్నడూలేనట్టుగా ఆసీస్ ఈ మ్యాచ్ లో ఆత్మవిశ్వాసం కోల్పోయి కనిపించిందని తెలిపారు. ముఖ్యంగా, డేవిడ్ వార్నర్ రన్ రేట్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని, గతంలో వార్నర్ ఎప్పుడు బ్యాటింగ్ చేసినా 100కి పైగా స్ట్రయిక్ రేట్ నమోదయ్యేదని, ఈ మ్యాచ్ లో అతడు తీసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. అంతకుముందు, రోహిత్ శర్మకు, హార్దిక్ పాండ్యకు లైఫ్ లు ఇవ్వడం ద్వారా ఆసీస్ భారీ మూల్యం చెల్లించుకుందని సచిన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News