Hyderabad: అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి: రేవంత్ రెడ్డి

  • నా మంచి మిత్రుడు అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడాలి
  • అక్బరుద్దీన్ అసెంబ్లీలో త్వరగా అడుగుపెట్టాలి
  • తెలంగాణ ప్రజల సమస్యలపై గళం విప్పాలని ఆకాంక్షిస్తున్నా

చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. వైద్య సేవల నిమిత్తం లండన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడాలని ఇప్పటికే పలువురు రాజకీయనేతలు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా, టీ-కాంగ్రెస్ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడాలని  ప్రార్థిస్తున్నామని అన్నారు. అక్బరుద్దీన్ వెంటనే కోలుకుని తెలంగాణ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో త్వరలోే ఆయన గళం విప్పాలని కోరుకుంటున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.

Hyderabad
chandrayanagutta
Revanth Reddy
akbar
  • Loading...

More Telugu News