Balakrishna: రోజులు గడిచే కొద్దీ నా వయసు తగ్గుతోంది....ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

  • పుట్టడం, చనిపోవడం సహజం
  • ఉన్నప్పుడు చేసిన మంచి పనులతో శాశ్వతంగా జీవించవచ్చు
  • సేవ చేయడం ఓ విధమైన అదృష్టం

తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజులు గడిచే కొద్దీ వయసు పెరుగుతుంది అంటారుగాని, నా వయసు మాత్రం తగ్గుతోందనిపిస్తోందని నవ్వులు పూయించారు. హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని  కేక్‌ కట్‌ చేశారు.

బసవ తారకం ఆసుపత్రి ద్వారా సేవలు, సినిమాల్లో నటన, ఎమ్మెల్యేగా ప్రజా సేవలో ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నానని, ఈ ఉత్సాహంతో తన వయసు తగ్గినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.  పుట్టడం, చనిపోవడం మానవ సహజమని, కానీ బతికి ఉన్నన్నాళ్లు చేసే మంచి పనుల వల్ల ఓ వ్యక్తి చనిపోయినా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని అన్నారు. క్యాన్సర్‌పై పోరాడాలన్న నాన్నగారి కలను సాధించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపం ఇచ్చారని బాలకృష్ణ గుర్తు చేశారు.

Balakrishna
Hyderabad
basavatarakam hospital
birthday
  • Loading...

More Telugu News