Pawan Kalyan: గుడి ముందు కూర్చుని అడుక్కుంటే అంతకంటే ఎక్కువ డబ్బొస్తుంది: పవన్ కల్యాణ్

  • ఓటుకు రూ. 2 వేలు ఇచ్చారు
  • ఓటర్లే తనకు చెప్పారన్న పవన్
  • ఇకపై రాజకీయ ఎత్తుగడలు వేస్తానని వెల్లడి

ఓటును కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో నాయకులు ఇచ్చే డబ్బును తీసుకోవడం కన్నా, ఓ గుడి ముందు కూర్చుని భిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన, ఎన్నికల తరువాత తాను కొందరు ఓటర్లను కలిశానని, ఓటుకు ఎంతిచ్చారని అడిగితే, వారు రెండు వేల రూపాయలు ఇచ్చారని చెప్పారని పవన్ గుర్తు చేసుకున్నారు. రెండు వేలను ఐదేళ్లకు విభజిస్తే, రోజుకు రూపాయి వస్తుందని, గుడి దగ్గర అడుక్కునే వారికి అంతకంటే ఎక్కువే వస్తాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని తానేమీ ఆశించలేదని వ్యాఖ్యానించిన పవన్, ఇకపై తన రాజకీయ ఎత్తుగడలు ఏంటో తెలుస్తాయని అన్నారు.

Pawan Kalyan
Temple
Vote
  • Loading...

More Telugu News