Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

  • మోదీకి ఆలయ మర్యాదలతో స్వాగతం
  • మోదీకి వేద ఆశీర్వచనం
  • ప్రధానికి స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాల అందజేత

తిరుమల శ్రీవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. మోదీతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం జగన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకు ముందు, మోదీకి ఆలయ మర్యాదలతో టీటీడీ ఈవో, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం వకుళామాతను, విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సబేరాలో మోదీకి స్వామి వారి శేష వస్త్రం కప్పి అర్చకులు ఆశీర్వదించారు. రంగనాయకుల మండపంలో వేదపఠనంతో మోదీకి ఆశీర్వచనం చేశారు. ప్రధానికి స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు.

Tirumala
pm
modi
Governer
Narasimhan
  • Loading...

More Telugu News