Prime Minister: వైఎస్ జగన్ కు అభినందనలు..ఏపీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తాం: ప్రధాని మోదీ

  • సుపరిపాలన అందించాలని జగన్ ను కోరుతున్నా
  • ఏపీ అనేక రంగాల్లో ముందంజలో ఉంది
  • ఏపీ ప్రజల్లో ప్రతిభాపాటవాలకు కొదవలేదు

ఏపీలో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ కు అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతిలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ఆయన మాట్లాడుతూ, దేశం, రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాలను ప్రజలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఏపీలో సుపరిపాలన అందించాలని జగన్ ను కోరుతున్నానని అన్నారు. ఏపీ అనేక రంగాల్లో ముందంజలో ఉందని, ఏపీ ప్రజల్లో ప్రతిభాపాటవాలకు కొదవలేదని ప్రశంసించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మోదీ మరోసారి హామీ ఇచ్చారు. అదే విధంగా, తమ ప్రభుత్వంపై దేశ ప్రజల ఆకాంక్షలు పెరిగాయని, వాటినీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అవినీతి రహిత పాలన అందించామన్న ఉద్దేశ్యంతోనే దేశ ప్రజలు తమను మళ్లీ ఆదరించారని అన్నారు.
ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై పనిచేస్తారని, జనంతో ఉంటేనే ప్రజల హృదయాలు గెలుస్తామని అన్నారు. కేవలం అధికారంలోకి రావడమే కాదు ప్రజాసేవకు అంకితం కావాలని, ప్రజాసేవకు ఉన్న అనేక మార్గాల్లో అధికారం అనేది ఒకటని అన్నారు.

Prime Minister
modi
cm
jagan
Tirupati
  • Loading...

More Telugu News