Jagan: కీలక పదవికి రోజా పేరును పరిశీలిస్తున్న వైఎస్ జగన్!

  • జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకోని రోజా
  • మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చే యోచనలో జగన్
  • అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరిన ఏపీ సీఎం

వైఎస్ జగన్ క్యాబినెట్ లో నగరి ఎమ్మెల్యే రోజాకు స్థానం కచ్చితంగా ఉంటుందని అందరూ భావించినా, సామాజిక న్యాయం లక్ష్యంగా తన మంత్రులను ఎంచుకున్న జగన్, రోజాకు మంత్రి పదవిని కేటాయించలేకపోయారు. ఇక క్యాబినెట్ లో తాను లేకపోవడంపై రోజా అసంతృప్తితో ఉండగా, ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్యేగా ఉన్న మహిళకు, ఈ పదవిని అప్పగించవచ్చా? అన్న విషయమై ఆయన అడ్వొకేట్ జనరల్ సలహాను కోరినట్టు సమాచారం. మామూలుగా అయితే, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్నవారు పార్టీలకు అతీతంగా ఉండాలి. ప్రస్తుతం ఈ పదవిలో నన్నపనేని రాజకుమారి కొనసాగుతున్నారు. ఆమె స్థానంలో రోజా నియామకానికి లీగల్ చిక్కులు అడ్డుకాకుంటే, అతి త్వరలోనే నియామకపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

Jagan
Roja
Women Commission
  • Loading...

More Telugu News