Kiranbedi: హెల్మెట్ పెట్టుకోకనే ముఖ్యమంత్రి భార్య మృతి: కిరణ్ బేడీ

  • ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించాల్సిందే
  • హెల్మెట్ లేకుండా బండిని స్వాధీనం చేసుకోండి
  • మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

తమిళనాడులో ద్విచక్ర వాహన చోదకులకు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, హెల్మెట్ లేకుండా కనిపిస్తే, బండిని సీజ్ చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన వేళ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారాయణ స్వామి భార్య, తలకు హెల్మెట్‌ లేకుండా బైక్ పై ప్రయాణించినందునే మరణించారని గుర్తు చేశారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నిర్బంధ హెల్మెట్ చట్టాన్ని సుప్రీంకోర్టు తెచ్చినా, తమిళనాడు, పుదుచ్చేరిలో సరిగ్గా అమలు కావడం లేదన్నారు. టూ వీలర్లు నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు. కాగా, గతంలో నిబంధనల అమలులో నారాయణస్వామి, కిరణ్ బేడీ మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. 2013లో నారాయణ స్వామి భార్య కలైసెల్వి, తన బంధువుతో కలిసి బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురై కన్నుమూశారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని టెంపో ఢీకొనగా, తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోయారు.

Kiranbedi
Tamilnadu
Puduchcherry
Narayanaswamy
Helmet
  • Loading...

More Telugu News