Ravela Kishore Babu: జనసేనకు రాజీనామా చేసిన రావెల... నేడు మోదీ సమక్షంలో బీజేపీలో చేరిక!

  • నిన్న రాజీనామా లేఖను పవన్ కు పంపిన రావెల
  • నేడు రేణిగుంటలో మోదీని కలిసి బీజేపీలోకి
  • మూడోసారి పార్టీ మారుతున్న రావెల

టీడీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. నేడు ప్రధాని తిరుమల పర్యటన సందర్భంగా ఆయన్ను కలిసి బీజేపీలో చేరాలని రావెల నిర్ణయించుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులోనే రావెల ప్రధానిని కలుస్తారని తెలుస్తోంది. రావెలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు కూడా బీజేపీలో చేరనుండగా, వీరికి మోదీ స్వయంగా కండువాలు కప్పనున్నారు. కాగా, నిన్న రావెల జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో కీలక నేతగా ఉన్న రావెల, ఇప్పుడు బీజేపీలో చేరితే, ఆయన మూడోసారి పార్టీ మారినట్టు అవుతుంది.

Ravela Kishore Babu
Jana Sena
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News