Narendra Modi: ఇలా వచ్చి, అలా వెళ్లి... రెండు గంటల్లోనే ముగియనున్న మోదీ తిరుమల పర్యటన!

  • సాయంత్రం 6 గంటలకు తిరుమలకు
  • ఆ వెంటనే మహాద్వారం ద్వారా స్వామి దర్శనానికి
  • 8.10కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

నేడు ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు రానుండగా, ఆయన పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. నేటి సాయంత్రం 3 గంటలకు కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరే ఆయన 4.30 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. ఆపై బీజేపీ కార్యకర్తల సమావేశం అనంతరం 5 గంటల తరువాత రోడ్డు మార్గాన బయలుదేరి అలిపిరి మీదుగా సాయంత్రం 6 గంటలకు తిరుమలకు వస్తారు. ఆ వెంటనే మహాద్వారం గుండా శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే ఆయన, 7.20 గంటలకెల్లా రేణిగుంటకు బయలుదేరుతారు. 8.10కి స్పెషల్ ఫ్లయిట్ లో ఢిల్లీకి తిరిగి బయలుదేరనున్నారు. కాగా, మోదీ పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం నాడు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకూ ట్రయల్ రన్ నిర్వహించారు. 

Narendra Modi
Tirumala
Tour
Renigunta
  • Loading...

More Telugu News