Jagan: చేయాల్సిన పనులివే... తన చాంబర్ లో బోర్డు పెట్టుకున్న జగన్!

  • ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతగా వర్ణించే జగన్
  • చాంబర్ ముందు, లోపలా మేనిఫెస్టో బోర్డులు
  • వైఎస్ నిలువెత్తు చిత్రపటం కూడా

ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా చూస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మేనిఫెస్టోను అధికారిక చాంబర్ ముందు గోడకు అతికించుకున్నారు. నవరత్నాల్లోని అంశాలన్నింటినీ ఫ్రేమ్ లుగా కట్టించి సీఎం చాంబర్ లో గోడలకు అంటించారు. తన గది బయటా, లోపల ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన బోర్డులను ఆయన ఏర్పాటు చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిబట్టే, మేనిఫెస్టోకు జగన్ ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం తెలిసిపోతుందని వైకాపా శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాగా, జగన్ తన చాంబర్ లో తండ్రి వైఎస్ నిలువెత్తు చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. విధినిర్వహణలో భాగంగా తాను చేయాల్సిన పనులు నిత్యమూ జ్ఞప్తికి వచ్చేందుకే జగన్ ఇలా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Jagan
Chamber
Manifesto
Board
  • Loading...

More Telugu News