Cricket: షకీబల్ హసన్ ఒంటరిపోరాటం... లక్ష్యఛేదనలో శ్రమిస్తున్న బంగ్లాదేశ్
- సెంచరీకి చేరువైన ఆల్ రౌండర్
- ప్రస్తుతం బంగ్లా స్కోరు 32 ఓవర్లలో 176/4
- ఇంగ్లాండ్ స్కోరు 386/6
387 పరుగుల లక్ష్యం అంటే ఎంత పెద్ద బ్యాటింగ్ వనరులున్న జట్టుకైనా కష్టమే! ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ కూడా అతి భారీ లక్ష్యం కళ్లముందు ఉండగా, తన వంతు ప్రయత్నం చేస్తోంది. 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా, ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 96 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ 44 పరుగులు చేసి సహకారం అందించినా, ఇంగ్లాండ్ బౌలర్ ప్లంకెట్ ఈ జోడీని విడదీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 32 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు. ఆ జట్టు గెలవాలంటే 18 ఓవర్లలో 211 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నా సాధించాల్సిన రన్ రేట్ 11కి పైగా ఉంది.